బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీగా ప్రైవేట్ భద్రత

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీగా ప్రైవేట్ భద్రత

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీగా ప్రైవేట్ భద్రత

ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల తరువాత కాంగ్రెస్ నేతల హెచ్చరికలపై స్పందనగా చర్య

హైదరాబాద్, జూలై 29 (M4News):

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అదనంగా 14 మంది ప్రైవేట్ గన్మెన్లను భద్రత కోసం కేటాయించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఫోన్ ట్యాపింగ్ అంశంలో తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల నుండి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కౌశిక్ రెడ్డి పై భద్రతా ముప్పు ఉందన్న నిఘా వ్యవస్థల నివేదికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ముందు జాగ్రత్త చర్యగా ఈ భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఉన్న అధికారిక భద్రతకు తోడు ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే ఆయన కోసం ప్రత్యేక భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కూడా యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment