ఆదివాసి నాయకపోడు సంఘం భీమారం మండల కమిటి ఎన్నిక.

ఆదివాసి నాయకపోడు సంఘం భీమారం మండల కమిటి ఎన్నిక.

ఆదివాసి నాయకపోడు సంఘం భీమారం మండల కమిటి ఎన్నిక.

మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి

భీమారం మండల కేంద్రంలోని ఆదివాసి నాయక పోడు సంఘం కుల సంఘం ఎన్నికలు బుధవారం రోజున జిల్లా ఉపాధ్యక్షులు తగినేని రవి నేతృత్వంలో నిర్వహించారు. భీమారం మండల అధ్యక్షునిగా రొడ్డ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా పూజారి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడిగా బూనేని రాజన్న,గుంటి సుధాకర్, జాయింట్ సెక్రటరీగా భూనేని సుధాకర్, , కోశాధికారిగా మంచాల కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులుగా మన బూతుల వెంకటేశ్వర్లు సలహాదారులుగా తోట శ్రీరాములు ను కుల సంఘం నాయకులు జిల్లా సంఘం నాయకుల సమక్షంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భీమారం మండల నూతన అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక రకాలుగా వెనుకబడినటువంటి మా ఆదివాసి నాయకపాడు ప్రజలను, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయుటకు తనవంతుగా అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకపోడు కుల సంఘం సభ్యులు,మహిళలు,యువకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment