రేషన్ బియ్యం పంపిణిలో కేంద్రానిదే పెద్ద వాటా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

రేషన్ బియ్యం పంపిణిలో కేంద్రానిదే పెద్ద వాటా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

రేషన్ బియ్యం పంపిణిలో కేంద్రానిదే పెద్ద వాటా

ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

బైంసా మనోరంజని ప్రతినిధి జూలై 30

ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో కేంద్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. బుధవారం సూరలోక గార్డెన్స్ లో లబ్ధిదారులకు కొత్త రేషన్ పంపిణి చేసిన సందర్భంగా మాట్లాడారు. రేషన్ బియ్యం కోసం కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు. నా హయాంలో నియోజకవర్గం లో 17 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్థుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపిడివో సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment