ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
భీమారం మండలంలోని కాజీపల్లి మరియు భీమారం లోని పలు ఎరువుల దుకాణాలలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్ బుక్స్ తనిఖీ చేయడం జరిగింది. ప్రతి డీలరు తప్పనిసరిగా స్టాక్ బోర్డ్ షాపు ముందు ఉంచాలని తెలిపారు. డీలర్లు ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్మిన, బ్లాక్ మార్కెటింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మండలానికి సరిపడా యూరియా మరియు డి ఏ పి అందుబాటులో ఉన్నాయని కావున రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు.
అలాగే డి ఏ పి కి బదులుగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా ఇతర కాంప్లెక్స్ ఎరువులైన 20:20:0:13 కానీ 28:28:0 ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు