ఆదర్శ దంపతులను సన్మానించిన దేవస్థాన చైర్మన్
మనోరంజని తెలుగు టైమ్స్, సారంగాపూర్ – నవంబర్ 24
నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన దిలావర్పూర్ మండలం కదిలి పాపాహారేశ్వరాలయం సోమవారం ప్రత్యేక దృశ్యానికి వేదికైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఓ ఆదర్శ దంపతులు ఆలయాన్ని సందర్శించి పరమేశ్వరుడి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం నిర్మల్‌కు చెందిన కార్తీక్, ఆస్ట్రేలియాకు చెందిన హనీ హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహం చేసుకుని దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు. స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఈ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ నార్వాడే వెంకట్రావు వారిని శాలువాతో సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు.
కార్యక్రమంలో అర్చకులు, భక్తులు, ఆర్మూర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.