ఈనెల 25న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్*

*ఈనెల 25న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్*

*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*

హైదరాబాద్:నవంబర్ 21
రాష్ట్రంలో గ్రామపంచాయ తీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్​ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిం చింది. పంచాయతీరాజ్​ చట్టం-2018 సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేష న్లన్నీ ఈసారి మారతాయని తెలిపింది.

ఎన్నికల్లో 50 శాతం మేరకు రిజర్వేషన్లు, మిగిలిన 50 శాతం జనరల్ కేటగిరీ స్థానాలుంటాయి. 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే ఎస్​ఈఈఈ పీసీ,2024 ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వే షన్లు ఖరారు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించాలి.

రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తికాగానే 25వ తేదీన షెడ్యూల్ ప్రకటించాలని ఎస్​ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్​ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,13,288 వార్డులు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్​ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదినీ గురువారం ఉన్నతాధికారు లు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ గురువారం ప్రారంభించారు. ఈనెల 23న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నా రు. బ్యాలెట్ బాక్సులు, ఇంకా తదితర ఎన్నికల సామగ్రిని ఇదివరకే ఎన్నికల సంఘం సేకరిం చింది. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో వివాదం తేలిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీ టీసీ ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment