బాసర రైల్వే స్టేషన్‌లో వందేమాతరం గీతాలాపనతో దేశభక్తి జ్వాలలు

బాసర రైల్వే స్టేషన్‌లో వందేమాతరం గీతాలాపనతో దేశభక్తి జ్వాలలు

శ్రీ జ్ఞాన సరస్వతి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో — వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి సందర్భంగా దేశభక్తి నినాదాలు
మనోరంజని తెలుగు టైమ్స్ బాసర ప్రతినిధి నవంబర్ 06

బాసరలో దేశభక్తి సందేశాన్ని ప్రతిధ్వనించిన విశిష్ట కార్యక్రమం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, శ్రీ జ్ఞాన సరస్వతి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, జిల్లా లోని ఏకైక రైల్వే స్టేషన్ బాసరలో గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు, ఆటో యూనియన్ సభ్యులు దేశభక్తి గీతాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితం చేశారు.
“దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు నడుము బిగించాలి” అని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు గురప్ప శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చౌస్, ప్రధాన కార్యదర్శి చాంద్, క్యాషియర్, కార్యాలయ సభ్యులు పాల్గొన్నారు.
దేశభక్తి నినాదాలతో బాసర రైల్వే ప్రాంగణం మార్మోగింది.

🔹 కావాలి?

Join WhatsApp

Join Now

Leave a Comment