ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 28 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ : విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యామండలి అవకాశం కల్పించింది. పదో తరగతి రోల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తూ విద్యార్థుల వివరాలు వస్తాయని చెప్పింది. ఏమైనా తప్పులు ఉంటే రిక్వెస్ట్ లెటర్‌ను కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా ఈ నెల 28లోగా ఆర్ఐవో ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పేరు మార్పు కోసం బ్యాంకులో రూ.100 చలానా కట్టాలని చెప్పింది