బైంసా పట్టణంలో మంగళవారం రంగుల పండుగ హోలీ సంబరాలను కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచే పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువత, పెద్దలు పరస్పరం రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
డీజే పాటల మోత మధ్య యువకులు స్టెప్పులు వేస్తూ నృత్యాలు చేయడంతో ప్రధాన వీధులు సందడిగా మారాయి. గుంపులుగా తిరుగుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హర్షధ్వానాలు చేశారు. పట్టణంలోని కాలనీలు, చౌరస్తాలు రంగుల మయంగా మారాయి.
ఈ కార్యక్రమంలో బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పర కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రాము, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సచిన్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు పట్టణ ప్రముఖులు కూడా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు సఖ్యతా వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.


