ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
M4 న్యూస్
తేదీ: అక్టోబర్ 11, 2024
బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. 2021లో బంగ్లాదేశ్‌కు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ ఈ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ వీడియో ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారయ్యింది.