ముధోల్, జులై 30
ముధోల్ మండలంలోని వడ్తల గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన రహదారులు చిత్తడిగా మారాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ రమేష్, సెక్రటరీ సురేష్ తెలిపారు. గురువారం వారు గ్రామంలోని ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతల్లోని నీటిని తొలగించే పనులను పరిశీలించారు.
ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారులు చిత్తడిగా మారాయని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని వడ్తల సర్పంచ్ రమేష్, సెక్రటరీ సురేష్ అన్నారు. గురువారం ముధోల్ మండలంలోని వడ్తల గ్రామంలోని ప్రధాన రహదారులపై ఏర్పడ్డ గుంతల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించే పనులను వారు పరిశీలించారు.
అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాలు కురవడం వల్ల రోడ్లపై అక్కడక్కడ ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీళ్ళు చేరి ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉదయం నుండి పారిశుద్ధ్య కార్మికులతో గుంతల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించే పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.
ప్రజలు సైతం తమ సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తనవంతుగా పాటుపడతానని అన్నారు. గ్రామంలో ఇప్పటికే పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టినట్లు తెలిపారు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త బండిలో చెత్తను సేకరిస్తున్నామని వివరించారు. ప్రజలు సైతం తమ వంతు బాధ్యతగా గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు.












