మండలంలోని అష్టా గ్రామ పంచాయతీ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామంలో ఎక్కడా నీరు నిలువకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి వార్డును పర్యవేక్షించి, పంచాయతీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు.
రాత్రి వేళల్లో గ్రామానికి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా, గ్రామంలోని ప్రతి చోట వెలుగు ఉండేలా విద్యుత్ బల్బులను సైతం అమర్చినట్లు తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే తమను సంప్రదించాలని, సహాయక చర్యలకై ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సెక్రెటరీ గాడేకర్ గంగాధర్, వార్డు సభ్యులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












