తెలంగాణ, 30 July
తెలంగణష్ట్ంలోనిుద్యోగSCయువతకుఆ్థికంగచేయూతనిచ్చేందుకుప్ుత్వంకలకని్ణయంతసుకుంది.SCక్పొేషన్ద్వసబ్సిడపైఎలక్ట్ిక్వహనలనుఅందించేందుకుఏ్పట్లుచేస్తోంది.ఆగస్టు15నటికివహనలపంపిణలక్ష్యంగఅధికులుచ్యలుచేపట్టు.
రాష్ట్రంలో నిరుద్యోగ SC యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. SC కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పథకం ముఖ్యాంశాలు: ద్విచక్ర వాహనాలు: లక్ష రూపాయలలోపు ధర కలిగిన ద్విచక్ర వాహనాలపై 90% సబ్సిడీ వర్తిస్తుంది.
త్ర్రిచక్ర వాహనాలు: నాలుగు లక్షల రూపాయలలోపు ధర కలిగిన త్రిచక్ర వాహనాలపై 70% సబ్సిడీ ఇవ్వడంతో పాటు, మిగిలిన మొత్తానికి బ్యాంక్ లోన్ మంజూరు చేయనున్నారు.
ఇప్పటివరకు సుమారు లక్షకు పైగా దరఖాస్తులు అందాయి. ఇందులో 5,016 ద్విచక్ర వాహనాలు, 2,508 త్రిచక్ర వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
జనాభా నిష్పత్తి ప్రకారం జిల్లాల వారీగా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని, ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాటికి వాహనాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.












