కడం (పెద్దూర్), 30/07/2026
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనితో ప్రాజెక్టు దిగువన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కడెం ప్రాజెక్టు ఎగువన గల పరివాహక (క్యాచ్మెంట్) ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, పల్లెకారులు మరియు ఇతరులు నది ఒడ్డుకు లేదా నదీ ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు కడెం ప్రాజెక్టు విభాగం నం.4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు, పోలీస్, రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేయాలని కోరారు.












