Nirmal/Dasturabad (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ నుండి నీటి విడుదలపై అత్యవసర సమాచారం అందింది. ప్రాజెక్ట్ అధికారులు, ఈరోజు (30-07-2026) ఉదయం 10:15 గంటలకు గేట్ నంబర్లు 5, 6, 7, 8, 9 లను ఒక్కొక్కటి 8 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ నుండి అత్యవసర సమాచారం వెలువడింది. ప్రాజెక్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఈరోజు (30-07-2026) ఉదయం 10:15 గంటలకు గేట్ నంబర్లు 5, 6, 7, 8, 9 లను ప్రతి గేటు 8 అడుగుల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో నీటి మట్టం 693.200 అడుగులకు చేరుకుంది. మొత్తం 18 గేట్లలో 5 గేట్లను ఎత్తారు. ప్రాజెక్ట్ నుండి 38,140 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేస్తున్నందున, దిగువ ప్రాంత ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు హెచ్చరించారు.












