Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వర్ణ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో స్వర్ణ గ్రామ సర్పంచ్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శితో కలిసి ప్రాజెక్టును సందర్శించి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వర్ణ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో స్వర్ణ గ్రామ సర్పంచ్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శితో కలిసి ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులను, సిబ్బందిని ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం, నీటిమట్టం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు పరిసర ప్రాంతాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాల దృష్ట్యా స్వర్ణ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా ప్రాజెక్టు వద్దకు వెళ్లవద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సర్పంచ్ మల్లేష్ విజ్ఞప్తి చేశారు.












