హైదరాబాద్, 2026-07-29
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో 7,437 ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ శాఖతో పాటు ఫైర్, జైళ్ల శాఖల్లో పలు ఖాళీల భర్తీకి సంబంధించి మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామని పోలీసు నియామక మండలి వెల్లడించింది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపిన నియామక మండలి, పూర్తి వివరాల కోసం tgprb.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.
ఎస్ఐ (సివిల్) - 148, ఎస్ఐ (ఏఆర్) - 14, టీజీఎస్పీ ఎస్ఐ - 12, ఎస్ఏఆర్సీపీఎల్ ఎస్ఐ - 3, ఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) - 23 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ అయింది.
కానిస్టేబుల్ (సివిల్) - 3,697, కానిస్టేబుల్ ఏఆర్ - 1052, పీటీవో కానిస్టేబుల్ - 20, కానిస్టేబుల్ మెకానిక్ - 7, స్పెషల్ పోలీస్ (ఎస్ఐ) - 44, కానిస్టేబుల్ - 1,038 పోస్టులు ఉన్నాయి.
ఫైర్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ - 39, ఫైర్ ఫైటర్ - 751 పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ (మెన్) - 14, డిప్యూటీ జైలర్ (మహిళ) - 1, వార్డర్ (మేల్) - 196, వార్డర్ (మహిళ) - 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.












