Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
సుమారు 110 ఏళ్ల నాటి శిథిల భవనంలో ముథోల్ తహసీల్దార్ కార్యాలయం నిర్వహించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ప్రమాదకర పరిస్థితుల్లో కార్యాలయం నడపడం సరికాదని ఆయన అన్నారు. వెంటనే నూతన భవనం మంజూరు చేయాలని లేదా సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనానికి కార్యాలయాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.
సుమారు 110 సంవత్సరాల నాటి శిథిలావస్థకు చేరుకున్న భవనంలో ముథోల్ తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్వహించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వస్తున్నారని, ప్రమాదకర భవనంలో కార్యాలయం నిర్వహించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రాల కాలం నుంచి ముథోల్ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని, తెలంగాణ ఏర్పడి నిర్మల్ జిల్లా ఏర్పాటైనప్పటికీ తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. వెంటనే నూతన భవనాన్ని మంజూరు చేయాలని, అప్పటి వరకు కార్యాలయాన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనానికి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లాలోని శిథిల ప్రభుత్వ భవనాలపై ప్రత్యేక సర్వే నిర్వహించి, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి, ధర్నాలు, ప్రజా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు వాగ్మారే విలాస్, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీ యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాకటి నిఖిల్, దగ్డే అంబదాస్, సింగారే సునీల్, వాగ్మారే సుదర్శన్, దగ్డే కరణ్, తదితరులు పాల్గొన్నారు.












