మిర్యాలగూడ, జూలై 29
మునిసిపల్ పరిధిలో అమలు జరుగుతున్న వెనుకబడిన తరగతుల పథకాల తీరును రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ బుధవారం మిర్యాలగూడలో అధికారులతో సమీక్షించారు. ఐదు రూపాయల భోజనం పథకం, మహిళా శక్తి కాంటీన్లలో బీసీలకు కల్పించిన ఉపాధి అవకాశాలపై ఆయన ఆరా తీశారు.
మునిసిపల్ పరిధిలో వెనుకబడిన తరగతుల పథకాల అమలు తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం మిర్యాలగూడ ఎన్ఎస్పి అతిథి గృహంలో మునిసిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై ఆరా తీశారు.
ఐదు రూపాయలకు భోజనం పథకం అమలు జరుగుతోందా అని ప్రశ్నించిన సురేందర్, మునిసిపల్ పరిధిలో బీసీ పథకాలు అమలు చేస్తున్నారా అని అడిగారు. పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మహిళా శక్తి కాంటీన్లో ఎంతమంది బీసీలకు ఉపాధి కల్పించారని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.
సమీక్షా సమావేశానికి ముందు కమిషన్ సభ్యులు సురేందర్‌కు ఆర్డిఓ ఎస్.రమణారెడ్డి, డిఎఓ, తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సంజీవ్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇస్తేరా ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పాత్రికేయులు ఖాజా హామీదుద్దీన్, ఎండి అస్లాం, జి. వెంకన్న, కె.నాగయ్య, ఎన్. నరేందర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, బొంగరాల మట్టయ్య, గుండా మహేష్, మనోజ్, రాచకొండ రమేష్, ఫోటో పత్రిక ఎడిటర్ నాగేశ్వరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.












