Delhi/Crown Human Rights, Delhi/Chirala (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. పోలీస్ శాఖతో పాటు ఫైర్, జైళ్లశాఖలలో కలిపి మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, ఫైర్, జైళ్లశాఖలలో పలు ఖాళీల భర్తీకి సంబంధించి మొత్తం 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పోలీసు నియామక మండలి తెలిపింది. మరిన్ని వివరాల కోసం tgprb.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.
ఎస్ఐ (సివిల్) - 148, ఎస్ఐ (ఏఆర్) - 14, టీజీఎస్పీ ఎస్ఐ - 12, ఎస్ఏఆర్సీపీఎల్ ఎస్ఐ - 3, ఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) - 23 పోస్టులు ఉన్నాయి.
ఎస్ఐ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కూడా పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కానిస్టేబుల్ (సివిల్) - 3,697, కానిస్టేబుల్ ఏఆర్ - 1052, పీటీవో కానిస్టేబుల్ - 20, కానిస్టేబుల్ మెకానిక్ - 7, స్పెషల్ పోలీస్ (ఎస్ఐ) - 44, కానిస్టేబుల్ - 1,038 పోస్టులు ఉన్నాయి.
ఫైర్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ - 39, ఫైర్ ఫైటర్ - 751 పోస్టులు, డిప్యూటీ జైలర్ (మెన్) - 14, డిప్యూటీ జైలర్ (మహిళ) - ఒక పోస్టు, వార్డర్ (మేల్) - 196, వార్డర్ (మహిళ) - 12 పోస్టుల భర్తీ జరుగుతుంది.












