నిర్మల్, జులై 9
నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపీఎస్ ఈరోజు వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్ ను పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డా జి జానకి షర్మిల ఐపీఎస్ ఈరోజు వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్ ను ఎస్పీ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
తదుపరి పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, కేసు ఫైళ్లు, స్టేషన్ రిజిస్టర్లు, మాల్ఖానా, ఆయుధాగారం, లాకప్, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, ఇతర పరిపాలనా అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
అలాగే ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్ రైటర్లు, సీసీటీఎన్ఎస్ సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తున్న తీరును ప్రశంసించారు.











