కుబీర్, జులై 08
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం బాసర, తానూర్, కుబీర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించి, ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పరిశీలించారు. గడువులోగా ఫారముల స్వీకరణ, డిజిటలీకరణ పూర్తి చేయాలని, ఓటర్లకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, గురువారం బాసర, తానూర్, కుబీర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా బాసర గ్రామపంచాయితీ ఆవరణలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పరిశీలించారు. గడువులోగా ఎస్ఐఆర్ ఫారముల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ఫారంలను పూరించుటలో ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ఇప్పటివరకు పూర్తయిన ఎస్ఐఆర్ ఫారముల డిజిటలీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎస్ఐఆర్ విషయంలో సహాయం చేయాలన్నారు. సూపర్వైజర్లు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
అనంతరం తానూరు మండలం సింగన్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. మొత్తం పంపిణీ చేసిన ఫారములు, ఇప్పటివరకు తిరిగి తీసుకున్న ఫారములు, పూర్తి చేసిన డిజిటలైజేషన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కుబీర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్ ఫారములు నింపుటలో ఓటర్లకు సహాయం చేయాలని బిఎల్ఓలకు అధికారులకు సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన డిజిటలైజేషన్ ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. యాప్ లో వివరాలను పరిశీలించారు. సమీపంలోని ఓటర్ ఇంటికి వెళ్లి, వారు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారో లేదో అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీలలో తహసిల్దార్లు పవన్ చంద్ర, మహేంద్రనాథ్, శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ లు వెంకటేష్ గౌడ్, అన్నపూర్ణ, సాయినాథ్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.











