మంచిర్యాల (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం పాత మంచిర్యాల ప్రాంతంలోని రాళ్లవాగును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో ఉన్న రాళ్లవాగును బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని చెప్పారు.
పోలీసులు సూచించిన ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, వాగులు, వంకలు, ముంపు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.











