Nirmal/Khanapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీలో ఎస్ఐఆర్ పారాల పూర్తి ప్రక్రియ 100% పూర్తయిందని సర్పంచ్ చింతల మల్లేష్ తెలిపారు. గ్రామంలోని ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై పార్టీ ప్రతినిధులకు ఆయన వివరాలు అందించారు.
ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామపంచాయతీలో ఎస్ఐఆర్ పారాల పూర్తి 100% పూర్తయిందని సర్పంచ్ చింతల మల్లేష్ తెలిపారు. పార్టీ ప్రతినిధుల మధ్య ఈ వివరాలను వెల్లడించారు. గ్రామంలో మొత్తం 824 ఓటర్లు ఉన్నారని, వీరిలో 25 డబ్బులు ఓట్లు, 32 చనిపోయిన ఓట్లు, 42 ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓట్లను తొలగించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఎల్ఓ సత్యవ్వ, బిఎల్ఏ వాల్ గో టు సాయి కృష్ణ, జిపిఓ భాగ్యలక్ష్మి, పంచాయతీ సెక్రెటరీ సూర్యనంద్, ఉప సర్పంచ్ ఓరుగంటి రాజేశ్వర్, కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ నాయకులు నబి ఖాన్, కామాజి శ్రీనివాస్, సంతోష్ గుగ్గిళ్ళ, బత్తిని శేఖర్, వార్డు సభ్యులు అరె శేఖర్, వాల్ గో టు లాస్య, ఆశ కార్యకర్త మీనుగు కమల, కారోబార్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.











