జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శనివారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత, నిల్వ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ గోదాంలో ఉన్న రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులను సమీక్షించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గోదాంలోని సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నిరంతర పర్యవేక్షణతో మెరుగైన భద్రతను కల్పించాలని అధికారులకు సూచించారు.
అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని ఆయన తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు రాజశ్రీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












