నిజామాబాద్, జూలై 14
నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ (వెంకటాపూర్, రాంపూర్) తొలి వంద శాతం ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసిన గ్రామపంచాయతీగా చరిత్ర సృష్టించింది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు స్వగ్రామమైన ఇక్కడ, బూత్ స్థాయి అధికారి లావణ్య ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.
నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ (వెంకటాపూర్, రాంపూర్) తొలి వంద శాతం ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసిన గ్రామపంచాయతీగా నిలిచింది.
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు స్వగ్రామమైన ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బూత్ స్థాయి అధికారి లావణ్య ఆధ్వర్యంలో ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
గ్రామంలో మొత్తం 547 మంది ఓటర్లు ఉండగా, 497 మంది ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. 10 మంది మృతి చెందగా, 16 మంది వివాహం కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం, 16 మంది ద్వంద్వ నమోదులు, 8 మంది నివాసం మార్చుకోవడం వంటి వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ ఓటర్ల సహకారానికి, బూత్ స్థాయి అధికారి లావణ్య సేవలకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోనే తొలి వంద శాతం ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసిన గ్రామపంచాయతీగా వెంకటాపూర్ నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.












