లోకేశ్వరం, జూలై 14
లోకేశ్వరం మండలం ధర్మోర విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) సుభాష్ మంగళవారం ప్రారంభించారు. గ్రామాల్లో తరచూ ఎదురయ్యే లో-వోల్టేజ్, హై-వోల్టేజ్ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు.
లోకేశ్వరం మండలం ధర్మోర విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) సుభాష్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ఈ సుభాష్ మాట్లాడుతూ, గ్రామాల్లో తరచూ ఎదురవుతున్న లో-వోల్టేజ్, హై-వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండటంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని, విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ తిలక్, ఏడీఈ రమేష్, ఏఈ శివప్రసాద్‌తో పాటు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.












