Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రం నుంచి అడెల్లి వరకు రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. స్థానిక సర్పంచ్ కూనేరు భూమన్న, గ్రామ కార్యదర్శి చైతన్య ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు కొలతల ప్రక్రియ చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ భూమన్న మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులను విస్తరించడం అవసరమన్నారు. రోడ్డు విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గి, రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందన్నారు.
అడెల్లి పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటోందని, రహదారి విస్తరణతో ట్రాఫిక్ జామ్ సమస్యలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఈ రహదారి అభివృద్ధి ఉపయోగపడుతుందని తెలిపారు.
రహదారిపై అవసరమైన భద్రతా చర్యలు, సురక్షిత మలుపులు, డివైడర్ల ఏర్పాటు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తామని అధికారులు వెల్లడించారు. స్థానికులు ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.