నిర్మల్, జూలై 10
గ్రామాల పరిశుభ్రత, సమగ్ర అభిృద్ధిలో సర్పచ్ల పాత్ర అత్యత కీలకమని జిల్లా స్థానిక సస్థల జిల్లా కలక్టర్ జిల్లాకలెక్టర్ బి. వెంకటేశ్వర్లుఅదనపుకలెక్టర్ కటేశ్ర్లు అన్నారు. గ్రామాల అభిృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్యతో పనిచేయాలని ఆయన సూచిచారు. శుక్రార ముధోల్ మడలలోని తరోడ గ్రామలో జరిగిన శిక్షణ కార్యక్రమలో ఈ ిషయాలు తలిపారు.
గ్రామాల పరిశుభ్రత, సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
శుక్రవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సర్పంచ్లకు గ్రామ పరిపాలనపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో చెత్త సేకరణను క్రమబద్ధంగా నిర్వహించేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చని తెలిపారు. సేంద్రియ వ్యర్థాలతో ఎరువులు తయారు చేసి గ్రామపంచాయతీలకు ఆదాయ వనరులు పెంచుకునే అవకాశముందని వివరించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రతి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.












