బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సహకారంతో అర్హులైన పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని ఇలేగాం సర్పంచ్ సిరం రాజమణి శ్రీనివాస్ తెలిపారు. భైంసా మండలంలోని గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సహకారంతో అర్హులైన పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని ఇలేగాం సర్పంచ్ సిరం రాజమణి శ్రీనివాస్ అన్నారు. భైంసా మండలంలోని గ్రామంలో డుమ్మోల్ల సత్వబాయి, రెడ్ల శంకుతలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రామంలో పెద్ద సంఖ్యలో అర్హులు ఉన్నారని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సర్పంచ్ తెలిపారు. ప్రస్తుతం ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన గుడిసెల సర్వేలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ప్రశాంత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు స్వరూప, కారోబారి అంబదాస్ తదితరులు పాల్గొన్నారు.












