Nirmal/Basar (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
ప్రత్యేక ఓటరు విస్తృత సవరణ సర్వే (సర్) ను మిర్యాలగూడ ఆర్డీవో ఎస్ రమణారెడ్డి తనిఖీ చేశారు. ఈ సర్వే ద్వారా ప్రతి ఓటర్ యొక్క పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ప్రత్యేక ఓటరు విస్తృత సవరణ సర్వే (సర్) ను బుధవారం ఓటరు నమోదు అధికారి మిర్యాలగూడ ఆర్డీవో ఎస్ రమణారెడ్డి తనిఖీ చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని పీఎస్ నెంబర్ 122 రామచంద్ర గూడెం, పిఎస్ నెంబర్ 113 చైతన్య నగర్ లలో సందర్శించి ఇంటింటి గణనను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డిఓ రమణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సంఘ నియమావళిని అనుసరించి ప్రత్యేక విస్తృత సవరణ సర్వే ఆధారంగా ప్రతి ఓటర్ పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. 1987కు ముందు ఓటరుగా నమోదైన వ్యక్తులకు స్వీయ గుర్తింపు కార్డు, 1987 నుండి 2004 మధ్య ఓటర్ గా నమోదైన వారు స్వీయ గుర్తింపు కార్డుతో తల్లి లేదా తండ్రి ఏదేని ఆధార పత్రాన్ని జతపరచాలన్నారు. ఓటర్ల నమోదుపై అవగాహన ఏర్పరచుకొని, క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని పరిపూర్ణ ఓటర్ల జాబితాను నమోదు చేయాలని బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. miryalaguda తహసీల్దార్ సహాయ ఎన్నికల అధికారి పి.శ్రీనివాస్, ఆర్ ఐ రామకృష్ణ, బి ఎల్ ఓ లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.












