నిర్మల్, జూలై 01
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించి, మధ్యాహ్న భోజనం చేశారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడ అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు.
క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచికరంగా, నాణ్యతతో ఉందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహకులు, సిబ్బందిని అభినందించారు.
ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత ప్రమాణాలను నిరంతరం పాటిస్తూ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.
భోజనం అనంతరం కలెక్టర్ భవేష్ మిశ్రా తన భోజనానికి సంబంధించిన బిల్లును డిజిటల్ విధానంలో స్వయంగా చెల్లించడం విశేషం.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.












