నిర్మల్, జూలై 1
ప్రతిరోజూ ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో అందిస్తున్న ఆహారం రుచికరంగా, నాణ్యతతో ఉందని నిర్వాహకులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. క్యాంటీన్లో పరిశుభ్రత ప్రమాణాలను నిరంతరం పాటిస్తూ, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. భోజనం అనంతరం కలెక్టర్ యూపీఐ ద్వారా భోజనానికి సంబంధించిన చెల్లింపును స్వయంగా చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డి.ఆర్.డి.ఓ. విజయలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సిబ్బంది పాల్గొన్నారు.