మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియలో కొందుర్గ్ మండలం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండలంలోని 23,404 మంది ఓటర్లకు గాను 99.80 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ విజయవంతంగా పూర్తయింది.
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియలో రంగారెడ్డి జిల్లాలో కొందుర్గ్ మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మండల పరిధిలో మొత్తం 23,404 మంది ఓటర్లకు గాను 23,350 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ వివరాల డిజిటలైజేషన్ పూర్తికాగా, 55 మంది ఓటర్ల వివరాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో 99.80 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన బీఎల్ఓలు, జీపీఓలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కొందుర్గ్ మండలం ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా మండల తహసీల్దార్ అజం అలీని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి, రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ గౌడ్, అంజిరెడ్డి, బీఆర్ఎస్ రెడ్డి నర్సింలు, సీపీఎం గోపాల్, రాజేందర్ గౌడ్, దుర్గని శ్రీను, జీపీఓలు హరీష్, నరేష్, శ్రీకాంత్, రామస్వామి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.












