కడం (పెద్దూర్), 2026-07-29
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద నీరు ఉద్ధృతంగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కడెం మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు ప్రాజెక్టు వద్ద భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద నీరు ఉద్ధృతంగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కడెం మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కడం మండల కేంద్రం తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్ సార్, సబ్ ఇన్స్పెక్టర్ P. సాయి కిరణ్ సార్, నిర్మల్ జిల్లా SDRF ఇన్చార్జ్ శ్రీనివాస్ యాదవ్ సార్, R.I శారద మేడం, సామాజిక సేవకులు CH. రాజేశ్ కుమార్ ఛత్రపతి గారు, అలాగే SDRF బృంద సభ్యులు కలిసి కడెం ప్రాజెక్టును సందర్శించారు. వర్షాన్ని లెక్కచేయకుండా, ప్రజల క్షేమమే తమ బాధ్యతగా భావించి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహాన్ని, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి అడుగులో అప్రమత్తత, ప్రతి నిర్ణయంలో ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న వారి సేవాభావం నిజంగా అభినందనీయం.











