నిర్మల్, జూలై 8
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ, డీఆర్డీఓ, జిల్లా పంచాయతీ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), జిల్లా పంచాయతీ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు రెండో దశలో ఇందిరమ్మ ఇండ్లను పారదర్శకంగా మంజూరు చేయాలని తెలిపారు. మండలాల వారీగా గృహాల నిర్మాణ పురోగతిని ఎంపీడీవోలతో సమీక్షించారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించి, ఇళ్ల నిర్మాణం నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.












