మిర్యాలగూడ, జూలై 8
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఫారాలను పూరించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్ఓలు) అప్రమత్తంగా వ్యవహరించాలని మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి, ఓటర్ నమోదు అధికారి ఎస్. రమణారెడ్డి ఆదేశించారు. స్థానిక డివిజన్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు బిఎల్ఓల పనితీరుపై ఆరోపణలు చేశారు. దీనికి స్పందిస్తూ ఆర్డిఓ పలు సూచనలు చేశారు.
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఫారాలను పూరించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్ఓలు) అప్రమత్తంగా వ్యవహరించాలని మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి, ఓటర్ నమోదు అధికారి ఎస్. రమణారెడ్డి ఆదేశించారు.
స్థానిక డివిజన్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) పై రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో, కొంతమంది బిఎల్ఓలు సక్రమంగా ఫారాలు పూరించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి స్పందిస్తూ, బిఎల్ఓలకు ఫారాలు పూరించడంలో సందేహాలుంటే, సూపర్వైజర్లను సంప్రదించి రాయాలని సూచించారు.
ఆయా రాజకీయ పార్టీలు సూచించి, ప్రభుత్వ ఆమోదం పొందిన బూత్ లెవెల్ ఏజెంట్లను (బిఎల్ఏ) ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలింగ్ బూత్ల రేషనలైజేషన్ ఉంటుందని తెలిపారు. 200 మంది ఓటర్లకు ఒక బూత్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉందని, త్వరలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ల ఏర్పాటు ఉంటుందని, ప్రజలకు అనుకూలంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నాగమణి, కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ పాతురి శరత్, బిఆర్ఎస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సజ్జల నాగిరెడ్డి, నాయకులు డి. నారాయణరెడ్డి, ఎఐఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ ఫారుఖ్, టీజెఎస్ నాయకులు క్రాంతికుమార్, బిఎస్పి నాయకులు దినేష్, ఎస్కె గాలిబ్ లు పాల్గొన్నారు.












