బుక్కపట్నం, 9 July
కుబీర్ మండలంలోని కుప్టి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని అన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా, నిర్మాణానికి అవసరమైన నిధులను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు.
కుబీర్ మండలంలోని కుప్టి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. పేదల సొంతింటి కలను నిజం చేసే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారు పాల్గొని, లబ్ధిదారులైన గౌరవ ఉల్జ పద్మ రాజేష్, బోయిడి చంద్రబాయి (తండ్రి పేరు ఆశన్న)లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నిరూపించుకుందని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున మాజీ ఎమ్మెల్యే శ్రీ జి. విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోనేలు కళ్యాణ్, మాజీ జెడ్పిటిసి శంకర్ చౌవాన్, ఏఎంసి వైస్ చైర్మన్ హైమద్, కుబీర్ మాజీ సర్పంచ్ విజయకుమార్, మలేగాం మాజీ సర్పంచ్ మైపాల్ రెడ్డి, రామ్ రెడ్డి, వెంకట్, ఏఎంసి డైరెక్టర్ మాజీ సాయన్న, మాజీ ఎంపిటిసి సుభాష్, సర్పంచులు బాలాజీ, గోపాల్, లక్ష్మణ్, బాబన్న, భూమేష్, ఉపసర్పంచులు సాయినాథ్, సాంబన్న, పోతన్న, వాగమరే కిషన్, సర్పంచి లక్ష్మణ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, డైరెక్టర్ సంతోష్, గణేష్, మారుతి పటేల్, ఎర్రన్న మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











