బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసా, నిర్మల్ పట్టణాల్లో ఆయన ఓటరు సవరణ కార్యక్రమాల అమలును పరిశీలించారు.
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం భైంసా పట్టణంలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం అమలును కలెక్టర్ పరిశీలించారు. పంపిణీ చేసిన దరఖాస్తులు, సేకరించిన దరఖాస్తులు, ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం నిర్మల్ పట్టణంలోని 24వ వార్డులో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం తీరును పరిశీలించారు. ఆన్లైన్ నమోదు పురోగతిని సమీక్షించి, పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల వినియోగంలో ఉన్న అనువర్తనాన్ని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
స్థానిక ఓటర్లతో మాట్లాడిన కలెక్టర్, ఎన్యుమరేషన్ దరఖాస్తులను పూర్తిగా నింపి బూత్ స్థాయి అధికారులకు త్వరగా అందజేయాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భైంసా ఉపకలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, తహసీల్దార్లు శశిభూషణ్, రాజు, మండల అభివృద్ధి అధికారి నీరజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












