నిర్మల్, జూలై 15
జూలై 25, 26 తేదీలలో నిర్మల్ జిల్లాలో జరగనున్న తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టి.జి.ఏ.ఎస్) రెండవ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తొడసం శంభు పిలుపునిచ్చారు. ఈ మహాసభలు ఆదివాసుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కీలకమని ఆయన అన్నారు.
జూలై 25, 26 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టి.జి.ఏ.ఎస్) రెండవ మహాసభలను విజయవంతం చేయాలని టి.జి.ఏ.ఎస్ నిర్మల్ జిల్లా కార్యదర్శి తొడసం శంభు పిలుపునిచ్చారు. బుధవారం ఇందిరానగర్‌లోని టి.జి.ఏ.ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తొడసం శంభు మాట్లాడుతూ, ఆదివాసుల హక్కుల పరిరక్షణ, జల్–జంగల్–జమీన్ రక్షణ, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ఈ మహాసభలు ఎంతో కీలకమని అన్నారు. మహాసభల విజయవంతానికి ఆదివాసులు, గ్రామ పెద్దలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలపాలని కోరారు.
అలాగే, ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక, నైతిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గేడం విష్ణు, కాతలే లక్ష్మణ్, పంద్రా నాగోరావు, గేడం అర్జున్, పంద్రా విజయ, గేడం సాంబాయి, కుమరం మోతుబాయి, గేడం లలిత బాయి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












