హైదరాబాద్, జూలై 15
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24తో ముగియనున్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఓటరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులకు సంబంధించి ప్రజలకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24తో ముగియనున్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
ఓటరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులకు సంబంధించి ప్రజలకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది నిర్ణీత గడువులోగా ప్రత్యేక సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం గడువును ఈ నెల 24 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.












