Mahabubnagar/Jadcherla (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
మిర్యాలగూడ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) పనుల సమస్యలను కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీసీ రోడ్లను ధ్వంసం చేయకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఎస్టీపీ-2 ప్లాంటును త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ లభించింది.
మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ సబ్ జైల్ రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) పనుల వల్ల ఏర్పడుతున్న సమస్యల తీవ్రతను గుర్తించిన కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి, బుధవారం సంబంధిత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సమస్యను ఎమ్మెల్యే బిఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఎస్టీపీ-2 ప్లాంటును త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
మిర్యాలగూడ పట్టణ ప్రజల సౌకర్యార్థం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని ఎస్టీపీ-2 మెయిన్ ట్రంక్ పరిధిలోకి వచ్చే 4, 5, 6, 7, 15, 16, 17, 18, 19, 20, 21, 36, 37, 38, 46, 47 వార్డులకు సంబంధించిన వడ్డెరగూడెం, బాపూజీ నగర్, రెడ్డి కాలనీ, ఇస్లాంపురం, కలాల్ వాడ, పెద్ద బజార్, కుండల బజార్, కూరగాయల మార్కెట్, ముత్తిరెడ్డి కుంట, సుందర్ నగర్, విద్యానగర్, హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ, ఈదులగూడెం ప్రాంతాలలో డ్రైనేజ్ పైపులు నిండిపోయాయని కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో, కొత్త పైప్లైన్ వేయడానికి సీసీ రోడ్డును ధ్వంసం చేయకుండా యూజీడీ పనులు చేపట్టాలని కౌన్సిలర్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, రఫీ, పండు, రంగయ్య, యూజీడీ విభాగపు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












