🚝* (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ను ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వాలని కోరుతూ బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రైల్వే లైన్ పనులను వెంటనే మంజూరు చేసి ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ భేటీలో ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, మాధవనేని రఘునందన్, గోడెం నగేష్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పైడి శంకర్, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. కొత్త రైల్వే లైన్ ప్రాధాన్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు.
ఈ రైల్వే లైన్ అనుసంధానం మెరుగుపడితే ఉత్తర తెలంగాణలోని వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వారు విన్నవించారు. కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తపరిచినట్లు సమాచారం.












