బైంసా తసిల్దార్ శశిభూషణ్ తెలంగాణ ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ముధోల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ చరిత్రపై రాసిన పుస్తకాన్ని పరిచయం చేసే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాసిల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తెలంగాణ ఉద్యమంలో ముధోల్ నియోజకవర్గ ఉద్యమకారులు పోషించిన పాత్రను పుస్తక రూపంలో తీసుకురావడం ద్వారా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందించవచ్చని శశిభూషణ్ తెలిపారు.
ముధోల్ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమ చరిత్రపై రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పుస్తకం వెలువడటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ పుస్తకం ద్వారా ఉద్యమకారుల త్యాగాలు, వారి పోరాట పటిమ భావితరాలకు చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత జాధవ్ పుండలిక్ రావు పాటిల్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉష్కం రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.











