రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అందరినీ కలుపుకుని విజయవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పిలుపునిచ్చారు. సోమవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
ఈనెల 14న నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలు సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి మార్గదర్శకాలని ఎమ్మెల్యే బిఎల్ఆర్ అన్నారు. రాజకీయ, కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.








