ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో జాప్యాన్ని సహించబోమని, నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో, కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని, మంజూరైన ఇళ్లు, ప్రారంభమైన నిర్మాణాలు, అటవీ నిబంధనల వల్ల నిలిచిపోయిన పనులపై అధికారులతో చర్చించారు. అటవీ సంబంధిత సమస్యల పరిష్కారానికి అటవీ అధికారులను కోరారు.
ఎంపీడీవోలు అర్హులైన దరఖాస్తులను గుర్తించి, తదుపరి దశకు పంపాలని, నిర్మాణంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతో మాట్లాడి, నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి రేవంత్ చంద్ర, హౌసింగ్, ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి సారించారు.












