కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ రావుల గంగారెడ్డి గురువారం ముద్గల్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో నిరుపేదలకు భరోసా లభించిందని, పేదల కలలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతాయని అన్నారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా కొన్ని దశాబ్దాల పాటు నిశ్చింతగా ఉండేలా గూడు లభించిందని కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ రావుల గంగారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని ముద్గల్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల కలలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతాయని, ప్రజలు దీనిని గుర్తించాలని పేర్కొన్నారు. ఎలాంటి ఆలస్యం కాకుండా బిల్లులను త్వరితగతిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, ఇచ్చిన హామీ ప్రకారం గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంజూరు చేయించినట్లు గంగారెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో ప్రతి పేదవాని కల నెరవేరేలా ప్రభుత్వం దిశా నిర్దేశంతో ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో పాలన సాగుతోందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం మార్గనిర్దేశ ఎజెండాతో ముందుకు వెళ్తోందని గంగారెడ్డి గుర్తుచేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నారాయణ రావు పటేల్ కు మండల ఇంచార్జి రావుల గంగారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.











