నిర్మల్, జూలై 9
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, నాణ్యమైన శారీరక విద్యకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU)ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ కలెక్టరేట్లో వర్చువల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, నాణ్యమైన శారీరక విద్యకు ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU)ని గురువారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, ఎంపీ పి.టి. ఉష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు నిర్మల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వర్చువల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బి. శ్రీకాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.











