మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్లిస్ పెర్రీ, క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 9 ఐసీసీ టైటిల్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. పురుషులు, మహిళల క్రికెట్లో మరెవరికీ సాధ్యం కాని ఈ ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు.
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు క్రీడాకారిణి ఎల్లిస్ పెర్రీ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక ఐసీసీ టైటిల్స్ (9) సాధించిన క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించారు. పురుషులు, మహిళల క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. ఆమె సాధించిన 9 టైటిళ్లలో 2 వన్డే ప్రపంచ కప్‌లు, 7 టీ20 ప్రపంచ కప్‌లు ఉన్నాయి. ఆస్ట్రేలియాకే చెందిన అలిస్సా హీలీ (8), లానింగ్ (7), మూనీ (6), మేగన్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పురుషుల క్రికెట్లో రికీ పాంటింగ్ 5, కోహ్లీ, రోహిత్ శర్మ చెరో 4 టైటిళ్లు సాధించారు.











