- భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి రష్మిక మందానని అంబాసిడర్‌గా నియమించింది.
- సోషల్ మీడియా వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతున్నందున అవగాహన అవసరం.
- రష్మిక తన అనుభవాలను పంచుకుంటూ, ప్రజలకు జాగ్రత్తగా ఉండమని సూచించింది.
సినీ నటి రష్మిక మందానని భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించింది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అవుతున్న నేపథ్యంలో, రష్మిక సైబర్ నేరాలపై అవగాహన పెంచడం కోసం మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఆమె ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంది.
హైదరాబాద్: అక్టోబర్ 15
సినీ నటి రష్మిక మందానని భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం సైబర్ నేరాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి, సోషల్ మీడియా యుగంలో ఏది ఫేక్, ఏది నిజమో తెలుసుకోవడం కష్టమైంది. వ్యక్తి ప్రైవసీకి స్వేచ్చ లేదనడం నిజం, మరియు వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండడం దారుణంగా సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో, రష్మిక, తన అనుభవాలను పంచుకుంటూ, “నా డీప్ ఫేక్ వీడియోని బాగా వైరల్ చేశారు. ఆ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. ఇది ఒక సైబర్ నేరం. అందుకే నేను భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను” అన్నారు.
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయనుంది. సైబర్ నేరగాళ్లు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో చెప్పలేము, అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని, “మనం కలిసి కట్టుగా పోరాడి, సైబర్ నేర రహిత భారత్‌ను క్రియేట్ చేద్దాం” అని రష్మిక పేర్కొన్నారు.
ఈ వార్త చూసిన చాలామంది రష్మికకు అభినందనలు తెలుపుతున్నారు, ఆమెకు ఈ విషయంలో ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.